ఏజెన్సీలోని కానిస్టేబుల్ పోస్టుల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏజెన్సీలోని కానిస్టేబుల్ పోస్టుల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత డిమాండ్

Kalvakuntla Kavitha demands 75 percent reservation for STs in agency constable posts
  • ప్రభుత్వం జారీ చేసిన 2026 పోలీస్ నోటిఫికేషన్‌పై కవిత అభ్యంతరం
  • ఈ నిర్ణయంతో గిరిజన యువత 400లకు పైగా పోస్టులు కోల్పోతారని ఆరోపణ
  • సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లోని కానిస్టేబుల్ పోస్టుల్లో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1988లో జారీ చేసిన జీవో 109, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ 49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని కవిత పేర్కొన్నారు. అయితే, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల జారీ చేసిన 2026 పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో ఈ నిబంధనను అమలు చేయలేదని ఆమె ఆరోపించారు. దీనివల్ల ఆదివాసీ, గిరిజన యువత కానిస్టేబుల్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.

గతంలో 2015, 2018, 2022 సంవత్సరాల్లో విడుదలైన కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజన యువతకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. కానీ, 2026 నోటిఫికేషన్‌లో ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని గిరిజన యువత 400కు పైగా కానిస్టేబుల్ పోస్టులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

హోంమంత్రిత్వ శాఖను కూడా పర్యవేక్షిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, 2026 కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో అవసరమైన సవరణలు చేసి ఆదివాసీ, గిరిజన యువతకు పూర్తి న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
Advertisement
Kalvakuntla Kavitha
Telangana Police Recruitment 2026
ST Reservation Agency Areas
Telangana Rakshana Sena
Revanth Reddy
Agency Constable Jobs

More Telugu News