టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- TV9 మాజీ సీఈవో వి. రవిప్రకాశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- ఆయనపై నమోదైన ఫోర్జరీ కేసులపై హైకోర్టు తీర్పులో జోక్యానికి నిరాకరణ
- కేసుల ఉపసంహరణను రద్దు చేసిన హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం
- విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన కోర్టు
- అలాందా మీడియా ఫిర్యాదుతో 2019లో నమోదైన ఈ కేసులు
టీవీ9 వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో వి. రవిప్రకాశ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCPL) యాజమాన్య హక్కుల వివాదంలో ఆయనపై నమోదైన ఫోర్జరీ, మోసం, కుట్ర ఆరోపణలకు సంబంధించిన రెండు క్రిమినల్ కేసులను పునరుద్ధరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సెప్టెంబర్ 9న విచారణ జరిపింది. తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి ఆధారాలు కనబడలేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో రవిప్రకాశ్‌పై నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణ యథావిధిగా కొనసాగనుంది.
కేసు నేపథ్యం ఏమిటి?
టీవీ9 బ్రాండ్‌తో ఛానళ్లను నిర్వహిస్తున్న ఏబీసీపీఎల్‌లో యాజమాన్య మార్పు సందర్భంగా ఈ వివాదం మొదలైంది. 2018లో అలందా మీడియా సంస్థ ఏబీసీపీఎల్‌లో 90.54% వాటాను కొనుగోలు చేసింది. అనంతరం అలందా మీడియా ప్రతినిధి పి. కౌశిక్ రావు 2019లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు రెండు వేర్వేరు ఫిర్యాదులు చేశారు.
నటుడు శివాజీకి రూ.20 లక్షలకు 40,000 ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు రవిప్రకాశ్ ఒక నకిలీ ఒప్పంద పత్రాన్ని సృష్టించారని క్రైమ్ నెం. 84/2019లో ఆరోపించారు. కొత్త యాజమాన్యాన్ని అడ్డుకునేందుకే ఈ ఫోర్జరీ పత్రాలను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును కూకట్‌పల్లి కోర్టు స్వీకరించి, సీసీ నెం. 9286/2022గా విచారణ జరుపుతోంది.
రెండో ఫిర్యాదు (క్రైమ్ నెం. 87/2019) ప్రకారం, కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారని ఆరోపించారు. కొత్త డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకోవడానికి, దేవేందర్ అగర్వాల్ రాజీనామా చేసినట్లు ఒక తప్పుడు పత్రాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద అప్‌లోడ్ చేశారని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ కేసు సీసీ నెం. 9288/2022గా విచారణలో ఉంది.
ప్రభుత్వ ఉపసంహరణ ప్రయత్నం, హైకోర్టు జోక్యం
ఈ కేసులు విచారణలో ఉండగా, 2024 మార్చి 15న తెలంగాణ ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ప్రాసిక్యూషన్‌కు విజయావకాశాలు తక్కువగా ఉన్నాయని, ఇది సివిల్ వివాదం లాంటిదని పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ఆధారంగా కూకట్‌పల్లి కోర్టు 2024 జూన్ 8న కేసుల ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది.
అయితే, కౌశిక్ రావు ఈ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్, 2025 ఫిబ్రవరి 25న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వ ఆదేశాలను గుడ్డిగా పాటించారని, కేవలం "పోస్ట్ ఆఫీస్"లా వ్యవహరించారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసులను పునరుద్ధరించి, విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పును రవిప్రకాశ్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, తాజాగా ఆయన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ నిర్ణయంతో కేసుల విచారణలో రవిప్రకాశ్ దోషి లేదా నిర్దోషి అని తేలలేదు. కేవలం ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగాలని మాత్రమే సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లయింది.