"మా కాలపు గొప్ప ప్రేమకథ": అమ్మ పుస్తకంపై రాహుల్, ప్రియాంక
- రాజీవ్ గాంధీ జయంతి నాడు వివరాలు పంచుకున్న రాహుల్ గాంధీ
- అమ్మ పడిన కష్టాలు తనకు, ప్రియాంకకు మాత్రమే తెలుసన్న రాహుల్
- ప్రేమ, వివాహం, రాజకీయ జీవితంపై పుస్తకంలో కీలక అంశాలు
- నవంబర్ 10న అంతర్జాతీయంగా విడుదల కానున్న పుస్తకం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఆయన భార్య, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ రాస్తున్న ఆత్మకథపై వారి పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భావోద్వేగభరితంగా స్పందించారు. తమ తల్లి రాస్తున్న 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం తమ కాలపు గొప్ప ప్రేమకథల్లో ఒకటిగా నిలుస్తుందని వారు అభివర్ణించారు. ఈ సందర్భంగా తమ తల్లికి, ఆమె ధైర్యానికి వారు ప్రశంసలు కురిపించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, 'అమ్మా' అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ పోస్ట్ చేశారు. "35 ఏళ్ల క్రితం నేను నాన్న, అమ్మలను చివరిసారిగా కలిసి చూశాను. నాన్న మరణానంతరం అమ్మ జీవితం ఎంత కష్టంగా మారిందో, ఆమె ఎంతటి వేదన అనుభవించిందో నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు. ఎన్నో సవాళ్లను అంతులేని ధైర్యంతో, గౌరవంతో ఎదుర్కొన్నారు. వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచే అమ్మ, తన కథను పంచుకోవడం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. తన అందమైన సోనియాను చూసి నాన్న గర్వంగా నవ్వుతూ ఉంటారు" అని రాహుల్ పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన తల్లి పుస్తకాన్ని "మా కాలపు గొప్ప ప్రేమకథల్లో ఒకటి"గా అభివర్ణించారు. "ధైర్యం, విధేయత, కరుణ కలిగిన మహిళ మా అమ్మ. అవసరమైనప్పుడు ఆమె ఉక్కులా దృఢంగా ఉంటారు. వారిద్దరి సంబంధాన్ని దగ్గర నుండి చూసే అదృష్టం నాకు దక్కింది. అమ్మ ఇంత నిజాయితీగా, మనసుపెట్టి ఈ పుస్తకం రాసినందుకు నాన్న ఎంతో గర్వపడి ఉండేవారు. లవ్ యూ, మా. నీ గురించి చాలా గర్వంగా ఉంది" అని ప్రియాంక తన పోస్టులో తెలిపారు.
'ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్' ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని నవంబర్ 10, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 544 పేజీల ఈ పుస్తకం పేరు 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'. ఈ పుస్తకం రాయడం అంత సులభం కాలేదని, తనలో తాను దాచుకున్న ఎన్నో అనుభవాలను పంచుకోవాల్సి వచ్చిందని సోనియా గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు. "విషాదం, నష్టమే నన్ను రాజకీయ ప్రపంచంలోకి నెట్టాయి. అంతకుముందు నా వ్యక్తిగత జీవితాన్ని ఎంతో కాపాడుకున్నాను. ఈ పుస్తకం నా కుటుంబంలోని మానవ సంబంధాలకు, నేను ఆరు దశాబ్దాలుగా చూసిన భారత దేశ సామాజిక, రాజకీయ మార్పులకు అంకితం" అని ఆమె వివరించారు.
ఈ పుస్తకంలో ఇటలీలో సోనియా బాల్యం నుండి 1965లో కేంబ్రిడ్జ్‌లో 19 ఏళ్ల వయసులో రాజీవ్ గాంధీని కలవడం, 1968లో వారి వివాహం, భారతీయ జీవితానికి అలవాటుపడటం, ఇందిరా గాంధీతో పరిచయం, సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ మరణాలు, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలం, ఆయన హత్య, రాజకీయాల్లోకి అయిష్టంగా ప్రవేశించడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేయడం, 2004లో ప్రధాని పదవిని తిరస్కరించడం వంటి అనేక కీలక ఘట్టాలు ఉన్నాయి. యువతిగా ఉన్న సోనియా గాంధీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో ఉన్న పుస్తకం కవర్ కూడా ఆకట్టుకుంటోంది.