ప్రధాని మోదీ రూ. 5000 ఇస్తున్నారా? ఈ ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు!
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ. 5000 ఇస్తున్నారని ప్రచారం
- సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
- వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు దొంగిలించేందుకు ఇది ఒక మోసం
- అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ప్రజలకు సూచన
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు రూ. 5,000 నగదు బహుమతి అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై స్పష్టతనిచ్చింది. ప్రభుత్వం ఇటువంటి పథకాన్నేదీ ప్రకటించలేదని, ఇది కేవలం మోసపూరిత ప్రచారమని తేల్చిచెప్పింది.
గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికల్లో "స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రధాని మోదీ రూ. 5,000 అందిస్తున్నారు. ఈ నగదును పొందేందుకు మీ బ్యాంకు వివరాలను నమోదు చేయండి" అనే సందేశాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీనిపై స్పందించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్, ప్రజల వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలను తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు పన్నిన పన్నాగమని హెచ్చరించింది.
ఇటువంటి నకిలీ సందేశాలను ఎవరూ నమ్మవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. గుర్తు తెలియని వ్యక్తులకు లేదా అనధికారిక వెబ్‌సైట్లలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా సంఖ్య, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని విజ్ఞప్తి చేసింది. జాతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇటువంటి మోసాలు అధికంగా జరుగుతుంటాయని, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కేవలం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే ధ్రువీకరించుకోవాలని ప్రజలను కోరింది. ఏదైనా అనుమానాస్పద సమాచారం దృష్టికి వస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించింది.