రాష్ట్రపతి భవన్ ‘ఎట్ హోమ్’లో ఈసారి ఏం వడ్డిస్తారో తెలుసా?
- రాష్ట్రపతి భవన్లో నేడు ‘ఎట్ హోమ్’ విందు
- నాలుగు రాష్ట్రాల వంటకాలు మెనూలో ప్రత్యేకం
- ఇండోరీ పోహాకు ప్రత్యేక స్థానం
- గోవా నుంచి పటోలియో, డోడోల్
- ఛత్తీస్గఢ్ నుంచి మినీ ఫర్రా, బఫౌరీ
రాష్ట్రపతి భవన్లో స్వాతంత్ర్య దినోత్సవం అంటే ప్రత్యేకతే. ఈసారి ఆ ప్రత్యేకత విందులోనూ కనిపించనుంది. దేశం నలుమూలల రుచులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ‘ఎట్ హోమ్’ విందు మెనూను సిద్ధం చేశారు. నాలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలతో అతిథులకు విందు ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రుచులు ఈ మెనూలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
మధ్యప్రదేశ్ రుచి
మెనూలో ఇండోరీ పోహా ప్రత్యేకంగా నిలవనుంది. అటుకులతో తయారయ్యే ఈ వంటకానికి జీరావన్ మసాలా, సేవ్, కొత్తిమీర, ఉల్లిపాయ, దానిమ్మ గింజలు జోడిస్తారు. కారం, పులుపు, తీపి, కరకరలాడే రుచులు కలిసిన ఈ పోహా ఇండోర్ ప్రత్యేకతను చాటనుంది.
గోవా నుంచి రెండు తీపి వంటకాలు
గోవాకు చెందిన పటోలియో మెనూలో ఉంది. పసుపు ఆకుల్లో బియ్యపు పిండితో చేసిన మిశ్రమాన్ని చుట్టి ఆవిరిపై ఉడికిస్తారు. లోపల కొబ్బరి, బెల్లం, యాలకుల మిశ్రమం ఉంటుంది. డోడోల్ మరో గోవా ప్రత్యేకత. కొబ్బరి పాలు, బెల్లం, బియ్యపు పిండితో తయారయ్యే ఈ తీపి వంటకం మృదువుగా, చిక్కగా ఉంటుంది.
ఛత్తీస్గఢ్ సంప్రదాయ రుచులు
ఛత్తీస్గఢ్ నుంచి మినీ ఫర్రా, బఫౌరీ విందులో చోటు దక్కించుకున్నాయి. బియ్యపు పిండితో చేసే ఫర్రాలో శనగపప్పు, మసాలాలు కలుపుతారు. బఫౌరీని శనగపప్పుతో తయారు చేసి ఆవిరిపై ఉడికిస్తారు. చట్నీతో కలిపి వడ్డిస్తారు.
మహారాష్ట్ర రుచి
మహారాష్ట్ర నుంచి ఖమాంగ్ కాక్డీని ఎంపిక చేశారు. దోసకాయ, కొబ్బరి, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీరతో దీన్ని తయారు చేస్తారు. ఆవాలతో చేసే తాలింపు దీనికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.
చిరుధాన్యాలతో పాయసం
కోడో మిల్లెట్ ఖీర్ ఈసారి మరో ప్రత్యేక ఆకర్షణ. కోడో మిల్లెట్, పాలు, చక్కెర లేదా బెల్లంతో దీన్ని తయారు చేస్తారు. యాలకులు, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ జోడించి వడ్డిస్తారు.
ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, దౌత్యవేత్తలు, విదేశీ రాయబారులు సహా 500 మందికిపైగా అతిథులు హాజరుకానున్నారు. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, ప్రకృతితో ప్రజల అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈసారి విందును రూపొందించారు.