విజయ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. జులై 23న ‘జన నాయగన్’ విడుదల
- తమిళనాడులో తొలి షో ఉదయం 9 గంటలకని టాక్
- ఏపీ, తెలంగాణలో ఉదయం 5 గంటల నుంచే షోలు వేసే అవకాశం
- చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు
- విడుదలకు ముందు 12 మార్పులు సూచించిన సెన్సార్ బోర్డు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. జులై 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్రబృందం రిలీజ్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకుంది.
తమిళనాడులో ఈ సినిమాకు ప్రత్యేకంగా ఉదయం 5 గంటల షోలు ఉండవని తెలుస్తోంది. తొలి ప్రదర్శన ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఉదయం 5 గంటల నుంచే షోలు వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇటీవలే ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. జులై 9న సర్టిఫికేషన్ పూర్తికాగా, సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాల 11 సెకన్లుగా నమోదైంది. విడుదలకు ముందు చిత్రంలో 12 మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించగా, ఆ మార్పులు చేశాకే సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిసింది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నటుడిగా కనిపించనున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.