పరీక్షలు రాయాలి.. గల్లీ క్రికెట్ ఆడాలి: వైభవ్‌కు మాజీ క్రికెటర్ సూచన
- పరీక్షలు రాయాలని వైభవ్‌కు కలినన్ సూచన
- గల్లీ క్రికెట్ ఆడే వయసులో ఉన్నాడని వ్యాఖ్య
- చిన్న వయసులో అధిక ఒత్తిడి మంచిది కాదని హెచ్చరిక
- సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళన
- సచిన్ టెండూల్కర్ మార్గదర్శనం తీసుకోవాలని సూచన
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్‌పై కాకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షలు రాయడంతో పాటు తన స్నేహితులతో గల్లీ క్రికెట్ ఆడుతూ సాధారణ బాలుడిలా ఎదిగే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
వైభవ్ ప్రతిభను ఎవరూ కాదనలేరని, కానీ 15 ఏళ్ల వయసులో అతడిపై భారీ అంచనాలు, సోషల్ మీడియా ఒత్తిడి పడటం మంచిది కాదన్నారు. చిన్న వయసులోనే స్టార్‌గా ముద్రపడితే మానసికంగా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వైభవ్‌కు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ మార్గదర్శనం చాలా అవసరమని కలినన్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే కోట్లాది మంది అంచనాల మధ్య ఎలా రాణించాలో సచిన్‌కు బాగా తెలుసని, ఆయన సలహాలు వైభవ్‌కు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.