ప్రజాప్రతినిధుల కోర్టులో బండి సంజయ్ కి ఊరట

Bandi Sanjay gets relief in Public Representatives Court case
  • హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బండి సంజయ్‌పై కేసు నమోదు
  • అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ.25 వేలు పంచుతోందని ఆరోపించిన సంజయ్
  • ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన హుజూరాబాద్ పోలీసులు

హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నమోదైన ఒక పాత కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది.


అసలు విషయానికి వస్తే... హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఓటుకు ఏకంగా రూ.25 వేల వరకు పంచుతోందని, అందులో ఓటర్లకు కేవలం రూ.5 వేలు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలే నొక్కేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విమర్శలపై అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది.


ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న హుజూరాబాద్ పోలీసులు.. బండి సంజయ్‌పై పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ వ్యవహారాన్ని పరిశీలించిన ప్రత్యేక కోర్టు.. ఆయనపై మోపిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Advertisement
Bandi Sanjay
Huzurabad by election case
Nampally court relief
Union Minister Bandi Sanjay
BRS party allegations
Telangana political news

More Telugu News