ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- బెంగళూరు నుంచి నాగపూర్ వెళుతున్న ఇండిగో విమానం
- విమానంలో సమస్యను గుర్తించి అధికారులకు సమాచారమిచ్చిన పైలట్
- విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు
ఈ విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిన్న కూడా రెండు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్‌వేపై దించారు. నిన్న ఉదయం శంషాబాద్ నుంచి జగ్దల్పూర్ బయలుదేరిన ఓ విమానంలో, ఆ తర్వాత మధ్యాహ్నం రాజమండ్రికి బయలుదేరిన మరో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తాయి.