సీఎం విజయ్ సలహాదారుగా తెలుగు వ్యక్తి... ఎవరీ విష్ణురెడ్డి?
- తమిళనాడు సీఎం విజయ్‌కు సలహాదారుగా విష్ణురెడ్డి నియామకం
- ప్రభుత్వ కార్యక్రమాల సలహాదారుగా కీలక బాధ్యతలు
- అన్నమయ్య జిల్లాకు చెందిన విష్ణురెడ్డి.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బంధువు
- సీఎం విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ తన సలహాదారుల బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వి.ఎం. విష్ణు వర్ధన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సాధారణ వ్యవహారాల సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ శుక్రవారం తమిళనాడు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
విష్ణురెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా, కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె గ్రామం. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు. గత 15 ఏళ్లుగా చెన్నైలో స్థిరపడిన విష్ణురెడ్డి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. నటుడు విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలిసిన సమయంలో కూడా విష్ణురెడ్డి ఆయన వెంటే ఉన్నారు.
కొత్త బాధ్యతల్లో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజాగ్రీవెన్స్ సమావేశాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను విష్ణురెడ్డి పర్యవేక్షిస్తారు. విష్ణురెడ్డితో పాటు రాజకీయ వ్యూహకర్త అయిన జాన్ అరోకియసామిని రాజకీయ వ్యవహారాల సలహాదారుగా నియమించారు.