పసిడికి బ్రేక్.. పరుగులు పెడుతున్న వెండి.. నేటి ధరలు ఇలా!
- వరుస పెరుగుదలకు బ్రేక్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర
- మరోవైపు పరుగులు పెడుతూనే ఉన్న వెండి ధర
- హైదరాబాద్లో రూ.440 తగ్గిన 24 క్యారెట్ల పసిడి
- కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరిగిన రేటు
గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం స్వల్పంగా బ్రేక్ పడింది. పసిడి ధర కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు కొద్దిగా ఊరట లభించింది. అయితే, వెండి ధర మాత్రం తన పరుగును కొనసాగిస్తూ మరోసారి భారీగా పెరిగింది.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఈరోజు ఉదయం 10.30 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గి రూ.1,59,490 వద్ద స్థిరపడింది. అలాగే, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.1,46,200కు చేరింది. మరోవైపు కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.5,000 పెరిగి రూ.2,95,000కు చేరుకుంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,240గా ఉండగా, ముంబైలో రూ.1,59,490గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,59,640 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా వెండి ధరలు కిలోకు రూ.2.85 లక్షల నుంచి రూ.2.95 లక్షల మధ్య పలుకుతున్నాయి.