కేబీఆర్ పార్కు వద్ద చెట్ల నరికివేత... సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

KBR Park Tree Cutting Supreme Court Orders
  • పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ
  • తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు
  • కేబీఆర్ పార్కులో 1300 చెట్లను నరికేస్తున్నారని పిటిషన్
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్కు పరిధిలో పర్యావరణపరంగా సున్నిత ప్రాంతంలో 25 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను కొట్టివేయవద్దని ఆదేశించింది. ఈ పనుల కోసం పార్కు పరిధిలో సుమారు 1,300 చెట్లు నరికేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

చెట్లు తొలగించడానికి ప్రణాళిక ఏమైనా ఉందా? చెట్లు తొలగించకుండా నిర్మాణం చేయవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాంటి ప్రణాళిక ఏమీ లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రభుత్వమే చెట్లను తొలగిస్తోందని ఆరోపించారు. వాదనల అనంతరం ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.
Go Back to Shorts
KBR Park
KBR Park Hyderabad
Hyderabad
Telangana Government
Supreme Court
Flyover Construction

More Telugu News