సన్‌రైజర్స్‌కు 169 పరుగుల టార్గెట్.. పిచ్ చూస్తే ఏమంత ఈజీగా లేదు!
- సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పోరాడే స్కోరు
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసిన గుజరాత్
- సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) హాఫ్ సెంచరీలు
- హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్‌లకు రెండేసి వికెట్లు
- సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 169 పరుగులు అవసరం
ఐపీఎల్ లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పోరాడే స్కోరు సాధించింది. కీలక బ్యాటర్లు సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో రాణించడంతో, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ ముందు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పిచ్ చూస్తే బ్యాటింగ్ కు సహకరించడంలేదు. ఏ బంతి ఎటు వస్తుందన్నది బ్యాటర్ల అంచనాకు అందడంలేదు.
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లు ఆరంభంలోనే గుజరాత్‌ను దెబ్బతీశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (5), జోస్ బట్లర్ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో గుజరాత్ 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్, నిషాంత్ సింధు (22)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. సింధు ఔటైన తర్వాత, వాషింగ్టన్ సుందర్‌తో కలిసి సుదర్శన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. సుదర్శన్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ దూకుడుగా ఆడాడు. కేవలం 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు.
హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, షకీబ్ హుస్సేన్ కూడా 2 వికెట్లు తీశాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు.