పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో హైదరాబాద్ విద్యార్థి మృతి
- క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్తంభానికి తాకడంతో విద్యుదాఘాతం
- మృతుడిని చందానగర్‌కు చెందిన హర్షిత్ రాజ్‌గా గుర్తింపు
- తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు
క్రికెట్ ఆడుతూ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విద్యార్థి తల్లిదండ్రులకు, స్థానిక పోలీసులకు ఐఐటీ పాట్నా అధికారులు సమాచారం ఇచ్చారు.