మార్ష్ వీరబాదుడు.. వర్షంతో ఆగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్

Mitchell Marsh Blitzkrieg Rain Halts Lucknow RCB Match
  • ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నోకు అదిరే ఆరంభం
  • ఆకాశమే హద్దుగా చెలరేగిన మిచెల్ మార్ష్
  • కేవలం 32 బంతుల్లో 76 పరుగులతో మార్ష్ విధ్వంసం
  • 9 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా లక్నో 95 పరుగులు
  • వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిన మ్యాచ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అయితే వర్షంతో మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు మార్ష్ సుడిగాలి ఆరంభాన్నిచ్చాడు. ఆర్సీబీ బౌలర్లపై మొదటి బంతి నుంచే ఎదురుదాడికి దిగిన మార్ష్, బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు.

మార్ష్ కేవలం 32 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (17 నాటౌట్) అతనికి చక్కటి సహకారం అందించాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. మార్ష్ దూకుడుతో లక్నో 9 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 95 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఈ దశలో వర్షం కురవడంతో ఆటకు అంతరాయం కలిగింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్సీబీ బౌలర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. కాగా, వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Go Back to Shorts
Mitchell Marsh
Lucknow Super Giants
Royal Challengers Bangalore
LSG vs RCB
IPL 2024
Indian Premier League
Cricket
Arshin Kulkarni
M Chinnaswamy Stadium
Rain Interruption

More Telugu News