హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అంబటి రాయుడికి కీలక పదవి
- హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా అంబటి రాయుడు
- సుప్రీంకోర్టు కమిటీ, అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నియామకం
- ఈ విషయాన్ని రాయుడు స్వయంగా వెల్లడి
- కొన్ని విషయాలను ప్రక్షాళన చేసే అవకాశం వచ్చిందన్న రాయుడు
- తెలంగాణ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని స్పష్టం
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) క్రికెట్ ఆపరేషన్స్ విభాగాధిపతిగా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని రాయుడు స్వయంగా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించాడు. ఈ నియామకం పట్ల రాయుడు సంతోషం వ్యక్తం చేశాడు.
సుప్రీంకోర్టు మానిటరింగ్ కమిటీ సభ్యుడు జస్టిస్ పి. నవీన్ రావు, హెచ్‌సీఏ కార్యదర్శి ఎం. జీవన్ రెడ్డి, అపెక్స్ కౌన్సిల్ ఈ నియామకం జరిపినట్టు అంబటి రాయుడు తెలిపాడు. "హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా నన్ను నియమించడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని విషయాలను ప్రక్షాళన చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం" అని పేర్కొన్నాడు.
అయితే, అంతకంటే ముఖ్యంగా హైదరాబాద్ లోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఉన్న అపారమైన క్రికెట్ ప్రతిభను వెలికితీయడంపైనే తాను ఎక్కువ దృష్టి సారిస్తానని రాయుడు స్పష్టం చేశాడు. ఇక్కడి యువ క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా వారిని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వివరించాడు. వివాదాలతో సతమతమవుతున్న హెచ్‌సీఏలో రాయుడి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, రాయుడు గతంలో హైదరాబాద్ రంజీ టీమ్ కు ప్రాతినిధ్యం వహించడం తెలిసిందే.