రైతులకు చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి
- ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆందోళన అవసరం లేదన్న నిపుణులు
- ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాన వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంచనా
- మే నెలాఖరుకే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని యూరోపియన్ సెంటర్ వెల్లడి
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ, రుతుపవనాల రాక తొందరగానే ఉంటుందని, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది రైతులకు, సామాన్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త.
భారత వాతావరణ శాఖ (IMD) మాజీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేశ్ ఈ అంశంపై మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, అయితే దీని ప్రభావం ఉత్తర భారతదేశంపైనే అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో మాత్రం వర్షాలు బాగానే కురుస్తాయని ఆయన తెలిపారు. రుతుపవనాలపై ఎల్‌నినోతో పాటు హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) కూడా ప్రభావం చూపుతుందని, ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఐవోడీ పాజిటివ్‌గా మారితే అది ఎల్‌నినో తీవ్రతను తగ్గించగలదని వివరించారు.
సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు, ఈసారి అంతకంటే ముందే వస్తాయని రమేశ్ అంచనా వేశారు. మే 14 లేదా 15 తేదీలకే అండమాన్‌ను పలకరిస్తాయని తెలిపారు. దీనిపై పూర్తి స్పష్టతతో భారత వాతావరణ శాఖ వచ్చే నెలలో అధికారిక బులెటిన్ విడుదల చేయనుంది. ఇదే అంచనాను యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ కూడా బలపరుస్తోంది. మే నెలాఖరు నాటికే దక్షిణ భారతదేశంలో వర్షాలు మొదలవుతాయని ఆ సంస్థ కూడా తాజాగా నివేదించింది.