ఇరాన్‌తో యుద్ధం ఎఫెక్ట్.. సగానికి తగ్గిపోయిన అమెరికా కీలక క్షిపణి నిల్వలు

Iran War Impact US Missile Stockpiles Reduced by Half
  • సుమారు రెండు నెలలుగా ఇరాన్, అమెరికా యుద్ధం
  • పడిపోయిన పేట్రియాడ్, థాడ్ ఇంటర్‌సెప్టర్‌, తోమహాక్ క్షిపణి నిల్వలు
  • ప్రిసిషన్ స్ట్రైక్ మిసైళ్ల నిల్వలో 45 శాతం కంటే ఎక్కువ వినియోగించిన అమెరికా
పేట్రియాట్, థాడ్ ఇంటర్‌సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయతుల్లా ఖమేనీని అంతమొందిస్తే ఇరాన్‌లో పాలన కూలిపోతుందని అమెరికా వేసిన అంచనాలు తారుమారయ్యాయి. ఇరాన్‌తో సుమారు రెండు నెలలుగా యుద్ధం సాగుతోంది. సుదీర్ఘకాలం యుద్ధం సాగుతుండటంతో అమెరికాలో క్షిపణి నిల్వలు క్షీణిస్తున్నాయి. ఇది అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది.

పేట్రియాడ్, థాడ్ ఇంటర్‌సెప్టర్‌తో పాటు తోమహాక్ క్షిపణి నిల్వలు కూడా 35 శాతం మేర క్షీణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రిసిషన్ స్ట్రైక్ మిసైళ్ల నిల్వలో 45 శాతం కంటే ఎక్కువగా ఇరాన్ యుద్ధంలో అమెరికా వినియోగించింది. స్వల్ప వ్యవధిలో సైనిక కార్యకలాపాలకు ఈ నిల్వలతో ఇబ్బంది లేనప్పటికీ, మరే ప్రాంతంలో భారీ ఘర్షణలో పాల్గొనాల్సి వస్తే ఈ ఆయుధ నిల్వలపై ఆధారపడే పరిస్థితి లేదని చెబుతున్నాయి.

మరోవైపు, ఇరాన్ కీలక సైనిక సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు పెంటగాన్ నిఘా విభాగం అంచనా వేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను భారీగా దెబ్బతీశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. కానీ ఇరాన్ ఆయుధ బలం అందుకు భిన్నంగా ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ కంటే అమెరికాకే కాల్పుల విరమణ ఒప్పందం అవసరం ఎక్కువగా ఉందని అంటున్నారు.
Go Back to Shorts
Iran War
US Missile Stockpile
Patriot Missiles
THAAD Interceptor
Tomahawk Missiles
Precision Strike Missiles

More Telugu News