నరేంద్ర మోదీపై ఖర్గే 'ఉగ్రవాది' వ్యాఖ్య... తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay demand apology from Kharge
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దేశాన్ని రక్తమోడేలా చేసిందని ఆగ్రహం
  • మోదీ హయాంలో ఉగ్రవాదుల పట్ల సానుకూల విధానం అంతమైందన్న బండి సంజయ్
  • మన సైన్యాన్ని ఆధారాలు అడిగిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన 'ఉగ్రవాది' వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదుల కోసం కన్నీరు కార్చి మన సైన్యం ధైర్యాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి భాష అలవాటైందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దశాబ్దాల పాటు ఉగ్రవాదంతో దేశం రక్తమోడేలా కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు.

నరేంద్ర మోదీ హయాంలో ఉగ్రవాదుల పట్ల సానుకూల విధానం అంతమైందని, దీంతో కాంగ్రెస్ పార్టీ నిరాశలో ఉందని విమర్శించారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ వంటి సందర్భాలలో కాంగ్రెస్ పదేపదే శత్రువుల కథనాలను ప్రచారం చేసిందని మండిపడ్డారు. మన సైన్యాన్ని ఆధారాలు అడిగిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.

బీజేపీ సేవా రాజకీయాలను నమ్ముతుందని, దుర్భాషలను లేదా నిరాశను కాదని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీని టెర్రరిస్ట్ అని పేర్కొనడం సరికాదని, ఈ తీరు ఓటమిని అంగీకరించలేని నైరాశ్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ దాడికి మాత్రమే కాదని, భారత ప్రజాస్వామ్య ఆత్మదాడికి పాల్పడుతోందని అన్నారు.
Go Back to Shorts
Bandi Sanjay demand Congress Apology
Kharge remark on Narendra Modi

More Telugu News