ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం: ప్రధాని మోదీ

India Korea Friendship Festival begins today
  • మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు
  • ఇరుదేశాల సంబందాలు బలోపేతం అయ్యే దిశగా పలు ఒప్పందాలు
  • ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా భాగస్వామ్యం
ప్రతి రంగంలోనూ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం చేసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారతదేశానికి వచ్చారు. ఇరుదేశాల సంబంధాలు బలోపేతం అయ్యే దిశగా ప్రధాని మోదీ, లీ జే మ్యూంగ్ సమక్షంలో పలు అవగాహన ఒప్పందాలు జరిగాయి.

ఈ సందర్భంగా జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, చిప్స్ నుంచి షిప్స్ వరకు, టాలెంట్ నుంచి సాంకేతిక వరకు, ఎంటర్‌టైన్మెంట్ నుంచి ఎనర్జీ వరకు ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వాణిజ్య ఒప్పందాల విలువ 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
Advertisement
India Korea Friendship
Narendra Modi

More Telugu News