ఐపీఎల్‌లో చేతబడి నిజమే.. ఒక ఓనర్ అలా చేసేవారు: లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
- సీఎస్కే-ఎస్ఆర్ హెచ్ మ్యాచ్‌లో ఫ్యాన్ నిమ్మకాయ ట్రిక్ వీడియో వైరల్
- ఐపీఎల్‌లో గతంలో చేతబడి జరిగిందన్న లలిత్ మోదీ
- ఓ జట్టు ఓనర్ ప్రత్యర్థి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలా చేశారని వెల్లడి
- అయితే, చెన్నై జట్టు రాసినట్టుగా చెప్తున్న లేఖ నకిలీదని స్పష్టీకరణ
- తన మూవీ/టీవీ సిరీస్‌లో పూర్తి వివరాలు బయటపెడతానని ప్రకటన
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో చేతబడి వంటివి గతంలో జరిగాయని, ఒక జట్టు యజమాని ఇలాంటి పనులకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) మ్యాచ్ సందర్భంగా చేతబడి జరిగిందంటూ వైరల్ అవుతున్న లేఖ మాత్రం నకిలీదని కొట్టిపారేశారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ పేసర్ సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌కు సిద్ధమవుతుండగా, సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబేను లక్ష్యంగా చేసుకుని ఓ అభిమాని 'నిమ్మకాయ ట్రిక్' చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని తర్వాత, సీఎస్కే ఫిర్యాదు చేసినట్టుగా ఓ లేఖ కూడా ప్రచారంలోకి వచ్చింది.
ఈ వివాదంపై లలిత్ మోదీ సోమవారం తన 'ఎక్స్' ఖాతాలో స్పందించారు. "ఈసారి వైరల్ అవుతున్న లేఖ నకిలీలాగే ఉంది. కానీ ఒక జట్టు యజమాని నిజంగానే ఇలాంటి పనులకు పాల్పడ్డారు. 2011 సీజన్‌లో ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ ఓనర్ ఇలాగే చేయడం నా దృష్టికి వచ్చింది. దీనిపై నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆ జట్టు యజమానులను అప్రమత్తం కూడా చేశాను. నా బృందం నిర్ణయం మేరకు రాబోయే సినిమా లేదా టీవీ సిరీస్‌లో ఈ వివరాలన్నీ బయటపెడతాను" అని ఆయన పేర్కొన్నారు.