20 ఏళ్లలో నేను చేయలేనిది.. ప్రియాంక 5 నిమిషాల్లో చేసింది: రాహుల్ గాంధీ
- హోంమంత్రి అమిత్ షాను తన ప్రసంగంతో ప్రియాంక నవ్వించారని ప్రశంస
- తనకు, ప్రధానికి కుటుంబ సమస్యలు లేవంటూ చమత్కారం
- రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో నవ్వులే నవ్వులు
- రాజకీయాల్లో తన సోదరి నుంచి ఎంతో నేర్చుకోవాలని వ్యాఖ్య
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను 20 ఏళ్లలో సాధించలేనిది, ప్రియాంక కేవలం ఐదు నిమిషాల్లో సాధించిందని సరదాగా వ్యాఖ్యానించారు. రాజకీయ జీవితంలో ఆమె నుంచి తాను చాలా నేర్చుకోవాల్సి ఉందని బహిరంగంగా అంగీకరించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిశాయి.
"నేను 20 ఏళ్లలో చేయలేని పనిని మా సోదరి 5 నిమిషాల్లో చేసి చూపించింది. ఆమె ప్రసంగం చూసి చాలా గర్వపడ్డాను. ఆమె హోంమంత్రి అమిత్ షాను నవ్వించారు" అని రాహుల్ అన్నారు. నేడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ప్రియాంక గాంధీ ప్రభుత్వంపై గట్టిగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ.. "ఈనాటి రాజకీయ చాణక్యాన్ని చూసి చాణక్యుడు బతికుంటే ఆశ్చర్యపోయేవారు" అని చురకలు అంటించగా, అమిత్ షా నవ్వారు.
లోక్‌సభలో మూడు కీలక బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్, తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... తనకు, ప్రధానమంత్రికి కుటుంబ సమస్యలు లేవంటూ మరో చమత్కారం విసిరారు. దీంతో సభ్యులంతా మరోసారి పగలబడి నవ్వారు.
ఈ సందర్భంగా 'నారీశక్తి'ని ప్రశంసించిన రాహుల్, ప్రతి ఒక్కరి జీవితంలో మహిళలు ముందుండి నడిపే శక్తిగా ఉంటారని కొనియాడారు. తన చిన్నతనంలో చీకటంటే భయపడినప్పుడు, తన నాయనమ్మ జీవిత సత్యాలు నేర్పి ధైర్యం చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.