Shubman Gill: గిల్ దూరం.. గుజరాత్‌కు భారీ దెబ్బ.. కెప్టెన్‌కు ఏమైంది?
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు జట్టు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. అతని గైర్హాజరీ జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన గుజరాత్, ఈ సీజన్‌లో రెండో ఓటమిని చవిచూసింది. గిల్ అందుబాటులో లేకపోవడంతో ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
టాస్ సమయంలో రషీద్ ఖాన్ మాట్లాడుతూ గిల్ గైర్హాజరీకి గల కారణాన్ని వెల్లడించాడు. "గిల్‌కు కండరాల నొప్పి ఉంది. అతను త్వరలోనే కోలుకుని తిరిగి వస్తాడని ఆశిస్తున్నాము" అని తెలిపాడు. ఈ నెల 8న ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ తన తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నాటికి గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని జట్టు యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ విషయంపై గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ మరింత స్పష్టత ఇచ్చాడు. "2025 నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గిల్ మెడకు గాయమైంది. దానికి కొనసాగింపుగా రెండు రోజుల క్రితం కండరాల నొప్పి మళ్లీ తిరగబెట్టింది. అయితే, గాయం అంత తీవ్రమైనదిగా కనిపించడం లేదు. రాబోయే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడని మేము ఆశిస్తున్నాము" అని పార్థివ్ తెలిపాడు.
గిల్ నాయకత్వ లక్షణాలను, ఆటతీరును ప్రశంసించిన బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హేడెన్
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్ బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హేడెన్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా గిల్ ఎదుగుదలను ప్రశంసించాడు. "శుభ్‌మన్ ఆటకు సంబంధించి చాలా స్పష్టమైన ఆలోచనలతో ఉంటాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతనికి ఆటపై మంచి పట్టు ఉంది. అతను మైదానంలోకి ఆత్మవిశ్వాసాన్ని తెస్తాడు. ఈ తరం ఆటగాళ్లలో ఉండే ఆధునిక దూకుడు అతనిలో కనిపిస్తుంది. తన భవిష్యత్తును తానే నిర్మించుకుంటున్న తీరు నాకు బాగా నచ్చుతుంది. అతను ఎప్పుడూ జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాడు" అని హేడెన్ పేర్కొన్నాడు. ఇంతటి కీలక ఆటగాడు గాయపడటం జట్టుపై ప్రభావం చూపినప్పటికీ, అతను త్వరలోనే తిరిగి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.