Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం: టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పార్టీ శ్రేణులందరికీ ఆయన తన అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ఐక్యత అత్యంత కీలకమని, ఈ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
దివంగత నందమూరి తారక రామారావు 'తెలుగువారి ఆత్మ గౌరవం' అనే నినాదంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక సంచలనం సృష్టించిందని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడటం వెనుక గొప్ప పోరాట చరిత్ర ఉందని అన్నారు. పార్టీ ప్రస్థానంలో ఎదురైన ఎన్నో క్లిష్ట పరిస్థితులను, ఒడిదుడుకులను చంద్రబాబు తన అపారమైన రాజకీయ అనుభవంతో అధిగమించారని కొనియాడారు. ఆయన నాయకత్వ పటిమ పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపిందని ప్రశంసించారు.
రాజకీయ లక్ష్యాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అజెండాగా చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించిన తీరు స్ఫూర్తిదాయకమని పవన్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలోనూ, ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ చంద్రబాబు తనదైన ముద్ర వేశారని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి ఐక్యతతోనే సాధ్యమని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్, ఈ ఐక్యతను, స్నేహబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటూ ముందుకు సాగుదామని తన ప్రకటనలో పిలుపునిచ్చారు.