Kishan Reddy: రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన

Kishan Reddy Suggests Key Measures to States
షార్ట్స్‌లో చూడండి
అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ, సామాన్యులపై భారం మోపవద్దనే ఉద్దేశంతో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్రాలు కూడా తమ పరిధిలోని వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన చేశారు. శనివారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ విదేశాల నుంచి ఇంధన సరఫరా సకాలంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దేశంలో ఇంధన నిల్వలపై వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ సాగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.ఇంధన కొరత భయంతో పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని,  దానిని నమ్మవద్దని కోరారు.

గతంలో కొన్ని కంపెనీలకు సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, అయితే ప్రస్తుతం ఆ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిగా గాడిన పడిందని, ప్రజలు అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు.
Go Back to Shorts
Kishan Reddy
Central Government
Excise Duty
VAT
Fuel Prices
Petrol Diesel
Gas Shortage
Lockdown
Energy Supply
Telangana

More Telugu News