Sai Ram: కరీంనగర్ జిల్లాలో ఆర్బీఎల్ బ్రాంచీలో భారీ కుంభకోణం
కరీంనగర్ జిల్లాలోని కిసాన్‌నగర్ ఆర్బీఎల్ బ్రాంచీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఏడు మ్యూల్ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. చైనా దేశానికి చెందిన మోసగాళ్లతో కలిసి సాయిరామ్ అనే వ్యక్తి కమీషన్ మీద ఈ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
ప్రతి లావాదేవీపై క్రిప్టో కరెన్సీ ద్వారా సాయిరామ్ రెండు శాతం కమీషన్ తీసుకున్నట్లు తేలింది. ఈ బ్యాంకులో ఈ తరహా మోసానికి సంబంధించి ఎనిమిది కేసుల్లో 13 మంది నిందితులను అరెస్టు చేసినట్లు కరీంనగర్ సీపీ వెల్లడించారు. నిందితులకు కమీషన్ ద్వారా రూ.2 కోట్ల వరకు వచ్చాయని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు ఉండటం గమనార్హం.