Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. ప్రియుడి కోసం కన్నతల్లి హత్య.. ఇంట్లోనే పూడ్చిపెట్టి 10 నెలలుగా నాటకం!

Ishika Murders Mother with Lover in Hyderabad Buries Body at Home
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరంలో పది నెలల క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రేమకు అడ్డుచెబుతోందన్న కారణంతో కన్నతల్లినే ఓ కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసి, మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ బైక్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు.

వివరాల్లోకి వెళితే... భరత్‌నగర్‌కు చెందిన అంజు అనే మహిళ పది నెలల క్రితం అదృశ్యమైంది. దీంతో ఆమె పెద్ద కుమార్తె బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పది నెలలుగా దర్యాప్తు చేస్తున్నా కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు. ఈ క్రమంలో అంజు చిన్న కుమార్తె ఇషిక, ఆమె ప్రియుడు మౌంటీరాజ్‌పై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు వాడిన బైక్ ఈ కేసులో కీలక ఆధారంగా మారినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో ఇషిక అసలు నిజాన్ని అంగీకరించింది.

ఇషిక, మౌంటీరాజ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే, వీరి ప్రేమ వ్యవహారాన్ని తల్లి అంజు తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రియుడిని వదిలేయాలని కూతురిని మందలించింది. దీంతో తమ ప్రేమకు అడ్డుగా ఉందని భావించి, తల్లిని హతమార్చాలని ఇషిక, మౌంటీరాజ్ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం అంజును దారుణంగా హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని అదే ఇంట్లో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు.

ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ, తన అక్కతో కలిసి తల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ దారుణ ఘటన బయటపడటంతో పోలీసులు ఇషిక, మౌంటీరాజ్‌లను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసే పనులు చేపట్టారు. కేవలం నాలుగు రోజుల పరిచయమైన ప్రియుడి కోసం కన్నతల్లిని కూతురే కిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Go Back to Shorts
Hyderabad
Ishika
Hyderabad crime
mother murder
lover
Mountyraj
Jawahar Nagar police
Bharat Nagar
Telangana crime news
matricide

More Telugu News