Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అరెస్ట్

Peddireddy Ramachandra Reddy Associate Arrested in RDO Office Fire Case
షార్ట్స్‌లో చూడండి

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె ఆర్డీవో కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ పోలీసులు తాజాగా కీలక అడుగు వేశారు. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాధవరెడ్డిని (ఏ3) అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు మరో నిందితుడు తుకారాం (ఏ4)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన ఈ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదయింది.


విలువైన భూములకు సంబంధించిన కీలక దస్త్రాలు, ముఖ్యంగా కబ్జాలకు గురైనట్లు ఆరోపణలు ఉన్న భూముల ఫైళ్లు ఈ ప్రమాదంలో కాలిపోవడంపై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి సీరియస్‌గా ఉంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఐడీ, లోతైన విచారణ జరిపి సేకరించిన పక్కా ఆధారాలతోనే వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై వేటు పడగా, ఇప్పుడు రాజకీయ నేతల అనుచరుల అరెస్టులతో అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ వేగవంతం కానుంది.

Go Back to Shorts
Peddireddy Ramachandra Reddy
Madanapalle RDO office fire
Andhra Pradesh politics
CID investigation
Madhava Reddy arrest
Tukaram arrest
File burning case
Land encroachment
AP government
Revenue officials

More Telugu News