ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి చేసిన కొన్ని గంటల్లోనే.. యూఏఈలో అతిపెద్ద టెర్మినల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి

Iran Drone Attack on UAE Fujairah Port After US Kharg Island Strike
  • యూఏఈలోని పుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి
  • డ్రోన్‌ను పేల్చివేయడంతో శకలాలు పడిన ప్రాంతం నుంచి మంటలు
  • యూఏఈకి పుజైరా కీలక ఇంధన నిల్వ కేంద్రం
  • పుజైరా చమురు పోర్టును తాత్కాలికంగా మూసివేసిన యూఏఈ
యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)‌లో అతిపెద్ద ఇంధన నిల్వల కేంద్రమైన పుజైరా ఓడరేవుపై ఇరాన్ డ్రోన్‌లతో దాడి చేసింది. దీంతో ఇక్కడ తీవ్ర మంటలు చెలరేగాయి. ఈ పుజైరా చమురు కేంద్రం ప్రపంచంలోనే పెద్దది కావడం గమనార్హం. ఇది హార్ముజ్ జలసంధికి వెలుపల ఉంటుంది. హార్ముజ్ జలసంధి మూసివేసినప్పటికీ ఈ పుజైరా ఇంధన నిల్వ కేంద్రం పోర్ట్ నుంచి చమురు ఎగుమతులు జరుగుంటాయి.

ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి అనంతరం, కొన్ని గంటల్లోనే ఇరాన్ డ్రోన్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడితో పుజైరాలో మంటలు, నల్లటి పొగ అలుముకుంది. అయితే ఇరాన్ డ్రోన్ తో దాడి జరపగా, ఆ డ్రోన్ ను పేల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్ శకలాలు పడిన ప్రాంతం నుంచి పొగలు వస్తున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.

పుజైరా కీలక ఇంధన నిల్వ కేంద్రం కావడంతో ఇరాన్ దీనిని లక్ష్యంగా చేసుకుంది. పుజైరా ఆయిల్ డిపో, పోర్టుపై బాంబులు, మిసైళ్లతో దాడికి పాల్పడింది. దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

వెంటనే అప్రమత్తమైన యూఏఈ పుజైరా చమురు పోర్టును తాత్కాలికంగా మూసివేసింది. చమురు ఎగుమతులు, దిగుమతులను నిలిపివేసింది. గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులు, దిగుమతులకు ఇది ప్రధాన కేంద్రం. పుజైరా చమురు పోర్టును మూసివేస్తే భారత్, చైనా, పాకిస్థాన్ సహా వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే అవకాశం ఉంది.
Advertisement
Fujairah Port
Iran drone attack
UAE
Kharg Island
oil terminal
energy reserves
Persian Gulf
oil exports

More Telugu News