Adah Sharma: 'సూపర్ వెల్లి'... కొత్త జానర్ ట్రై చేస్తున్న ఆదా శర్మ

Adah Sharma as Super Velli in Dynamic Role
‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అదా శర్మ, ఇప్పుడు ఓ సూపర్‌ ఉమన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ కొత్త చిత్రానికి ‘సూపర్ వెల్లి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు రాజేష్ బచ్చాని దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో అదా శర్మ పాత్ర చాలా భిన్నంగా ఉండనుంది. ప్రపంచాన్ని కాపాడే సూపర్‌ హీరోలా కాకుండా, తన శక్తులతో ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే సోమరి, గందరగోళ స్వభావం ఉన్న పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌లో కూడా, ప్రపంచాన్ని రక్షించడం కంటే నిద్రపోవడానికే ఇష్టపడే పాత్రగా ఆమెను చూపించారు.

దర్శకుడు రాజేష్ బచ్చాని మాట్లాడుతూ.. "కమాండో సినిమాలో అదా చేసిన భావనా రెడ్డి పాత్ర నాకు గుర్తుంది. ఆమెలోని సహజమైన ప్రతిభ, చురుకుదనం, హాస్యం చూశాక మా ‘సూపర్ వెల్లి’ పాత్రకు ఆమే సరైన ఎంపిక అనిపించింది. మూడేళ్లుగా ఈ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాం" అని తెలిపారు.

Adah Sharma
Super Velli
Adah Sharma Super Velli
The Kerala Story
Rajesh Bachchani
Telugu Cinema
Superhero Movie
Komando Movie

More Telugu News