Rahul Gandhi: 'కేరళ స్టోరీ' సినిమాను ఎవరూ చూడటం లేదన్న రాహుల్ గాంధీ... బీజేపీ ఎంపీ భార్య కౌంటర్

Rahul Gandhi Says No One Watching Kerala Story Movie
  • నిజమైన కేరళ సంస్కృతి, సంప్రదాయాలు ప్రజలకు తెలుసన్న రాహుల్ గాంధీ
  • రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ ఎంపీ భార్య
  • ఇంట్లో కూర్చుని మాట్లాడటం సరికాదన్న సురభి తివారీ
'ది కేరళ స్టోరీ-2' చిత్రాన్ని ఎవరూ చూడటం లేదని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఈ చిత్రాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. నిజమైన కేరళ సంస్కృతి, సంప్రదాయాలు ఏమిటో ఈ దేశ ప్రజలందరికీ తెలుసని అన్నారు. కానీ సమాజంలో విద్వేషాలు పెంచడానికి, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి కొందరు వ్యక్తులు సినిమాలను, మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.

కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, అలాంటి కార్యకలాపాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కూడా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవతలి వారికి సమాధానం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వరని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ స్పందించారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సురభి తివారీ తప్పుబట్టారు. ఇంట్లో కూర్చుని ఇలాంటి మాటలు మాట్లాడటం సరైన విధానం కాదని హితవు పలికారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాక, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కేసులు చదివిన తర్వాత అది నిజమో కాదో ప్రజలే తేల్చుకుంటారని అన్నారు.
Rahul Gandhi
Kerala Story
The Kerala Story
Surabhi Tiwari
Manoj Tiwari
BJP
Kerala

More Telugu News