Chiranjeevi: గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
- జయసుధకు ఏఎన్నార్ అవార్డు
- ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి
- ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్)
- ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
2025లో విడుదలైన చిత్రాలకు సంబంధించి 'గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025' విజేతలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఈరోజు విజేతల పేర్లను ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిలింలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు.
స్పెషల్ అవార్డులు:
- ఎన్టీఆర్ జాతీయ అవార్డు - చిరంజీవి
- ఏఎన్నార్ అవార్డు - జయసుధ
- పైడి జయరాజ్ అవార్డు - కమల్ హాసన్
- నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్వనిదత్
ఫీచర్ ఫిల్మ్స్:
- ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి
- ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా
- ఉత్తమ తృతీయ చిత్రం - ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌షో
- ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్)
- ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ బాలనటుడు - మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
- ఉత్తమ సహాయ నటుడు - శివాజీ
- ఉత్తమ సహాయనటి - భూమిక (యూఫోరియా)
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ - తండేల్
- ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా - కోర్ట్
- ఉత్తమ ప్రజాదరణ చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం
- ఉత్తమ డాక్యుమెంటరీ - యూనిటీ
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు - సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
- ఉత్తమ బాలల చిత్రం - అనగనగా
- ఉత్తమ సంగీత దర్శకుడు - మార్క్ రాబిన్ (దండోరా)
- ఉత్తమ గాయకుడు - అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ గాయని - సాహితీ (కన్నప్ప)
- ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్ (యుఫోరియా)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ లిరిసిస్ట్ - నందకిశోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్).
- ఉత్తమ సినీ గ్రంధం: ప్రభు (శూన్యం నుండి శిఖరాగ్రాలకు)
- ఉత్తమ సినిమా విమర్శకుడు: హెచ్ రమేశ్ బాబు