కిటికీలకు దూరంగా ఉండండి: ఇరాన్ దాడుల వేళ దుబాయ్ వాసులకు అలర్ట్
- గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడి
- దుబాయ్‌లో స్థానిక పౌరులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ
- అత్యవసర పరిస్థితి తలెత్తితే సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచన
- ముందు జాగ్రత్త చర్యగా కిటికీలకు దూరంగా ఉండాలని సూచన
దుబాయ్‌లో కూడా స్థానిక పౌరులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శుక్రవారం నాడు క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని కొంతమందికి మొబైల్ అలర్ట్ లు వస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, ముందుజాగ్రత్త చర్యగా కిటికీలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా, మొబైల్ ఫోన్ల ద్వారా పౌరులకు జాగ్రత్తలు చెబుతోంది.