Nani: 'మృత్యుంజయ్' మూవీపై నాని రివ్యూ

Nani Reviews Sri Vishnus Mrutyunjay Movie
  • మృత్యుంజయ్ సినిమా చూసిన నేచురల్ స్టార్ నాని
  • సినిమా ఆద్యంతం ఆకట్టుకుందని ట్వీట్
  • నిర్మాత సన్నీ గుణ్ణంకు కంగ్రాట్స్ చెప్పిన నాని
  • మంచి సినిమాను ఎప్పుడూ ప్రోత్సహిస్తారంటూ శ్రీవిష్ణు రిప్లై
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సినిమా 'మృత్యుంజయ్'. రేపు (మార్చి 6) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చిత్ర బృందపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చాలా బాగుందని, చివరి వరకూ తనను కదల్లేకుండా సీట్లోనే కూర్చోబెట్టిందని నాని పేర్కొన్నారు.

సాధారణంగా శ్రీవిష్ణు అంటేనే మంచి కామెడీ టైమింగ్, ఫన్ రోల్స్ గుర్తుకొస్తాయని, దానికి ఆయన పెట్టింది పేరని నాని అన్నారు. అయితే ఈ సినిమాలో శ్రీవిష్ణు నటన తనను ఆశ్చర్యపరిచిందని, చాలా బాగా చేశాడని మెచ్చుకున్నారు. 

అలాగే తన మొదటి ప్రొడక్షన్ లోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్న నిర్మాత సన్నీ గుణ్ణంకు నాని కంగ్రాట్స్ చెప్పారు. తాను ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటానని, సన్నీ కూడా అదే దారిలో వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని హీరోయిన్ రెబా మోనికా జాన్, దర్శకుడు హుస్సేన్ షా కిరణ్, నిర్మాణ సంస్థ లైట్ బాక్స్ కు నాని శుభాకాంక్షలు తెలిపారు.

నాని చేసిన ట్వీట్ పై హీరో శ్రీవిష్ణు వెంటనే స్పందించారు. నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "థ్యాంక్యూ నాని గారు.. మంచి సినిమాను మనస్ఫూర్తిగా ప్రోత్సహించడంలో, సెలబ్రేట్ చేసుకోవడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. మృత్యుంజయ్ గురించి మీరు చెప్పిన మాటలు నాకు, మా చిత్ర బృందం మొత్తానికి ఎంతో బలాన్నిచ్చాయి. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు" అంటూ శ్రీవిష్ణు రిప్లై ఇచ్చారు. 
Nani
Mrutyunjay Movie
Sri Vishnu
Reba Monica John
Hussain Sha Kiran
Sunny Gunnam
Telugu cinema
Movie review
Tollywood
Light Box

More Telugu News