Nitish Kumar: నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు వెళ్లనున్నారా?

Nitish Kumar to Resign as Chief Minister and Go to Rajya Sabha
  • నితీశ్ కుమార్ రేపు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారని కథనాలు
  • రాజ్యసభకు ఎన్నికయ్యాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు
  • కుమారుడు నిశాంత్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని కథనాలు
నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారా? అనే చర్చ జాతీయ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారని, ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నితీశ్ కుమార్ రేపు పార్లమెంటు ఎగువ సభకు నామినేషన్ దాఖలు చేయనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం ఢిల్లీ నుంచి పాట్నాకు వచ్చి నితీశ్ కుమార్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కూడా ఢిల్లీ నుంచి పాట్నాకు వచ్చినట్లు తెలుస్తోంది. బీహార్‌లో జరుగుతున్న పరిణామాలు నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళతారని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.

నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆయన తర్వాత ఎవరు అనే చర్చ సాగుతోంది. ఆయన కుమారుడు నిశాంత్ రాజకీయాల్లోకి రానున్నారని, త్వరలో జేడీయూ ఈ అంశంపై ప్రకటన చేస్తుందని బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. తన కుమారుడు రాజకీయల్లోకి రావడానికి నితీశ్ కుమార్ కూడా అంగీకరించారని అంటున్నారు. నిశాంత్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

బీహార్‌లో ఎన్డీయేకు 202 సీట్ల బలం ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్డీయే కూటమి 4 నుంచి ఐదు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
Nitish Kumar
Bihar politics
Rajya Sabha
JDU
Chief Minister resignation
Nishant Kumar
Bihar NDA

More Telugu News