తమ్ముడి ప్రీ వెడ్డింగ్ పార్టీ.. అందరికీ థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
- అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక
- హాజరైన అతిథులకు ధన్యవాదాలు తెలిపిన బన్నీ
- సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఐకాన్ స్టార్
- ప్రపంచవ్యాప్తంగా విషెస్ చెప్పిన వారికి కృతజ్ఞతలు
- అల్లు ఫ్యామిలీ పేరుతో లేఖ విడుదల చేసిన అల్లు అర్జున్
ఈ మేరకు అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. "మా పిలుపు మేరకు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరై, అందమైన జంటపై మీ ఆశీర్వాదాలు కురిపించిన వారందరికీ మా ధన్యవాదాలు. అలాగే ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపుతున్న వారి ప్రేమకు మా హృదయం నిండిపోయింది. మీ ఆప్యాయత, అనురాగాలకు థ్యాంక్స్" అని 'అల్లు ఫ్యామిలీ' తరఫున బన్నీ పేర్కొన్నారు.
కాగా, అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహం మార్చి 6న జరగనుంది. ఈ పెళ్లి వేడుకల పట్ల మెగా అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తి ఓ రేంజిలో ఉంది.