Danam Nagender: నాకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: దానం నాగేందర్

Danam Nagender Says He Has Not Received Any Notices From Speaker
  • నెక్లెస్ రోడ్డులో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న దానం నాగేందర్
  • స్పీకర్ నుంచి వ్యక్తిగతంగా నోటీసులు రాలేదని వెల్లడి
  • రేపో ఎల్లుండో వెళ్లి తన అభిప్రాయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తానన్న దానం నాగేందర్
అనర్హత పిటిషన్లకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. స్పీకర్ నుంచి తనకు వ్యక్తిగతంగా నోటీసులు అందలేదని వెల్లడించారు. నోటీసులు రేపు అందే అవకాశం ఉందని అన్నారు. అయితే రేపో ఎల్లుండో తాను నేరుగా తన అభిప్రాయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తానని అన్నారు.

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో దానం నాగేందర్ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ఆయన కాసేపు హోలీ ఆడారు. అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో ఆయన అనర్హత పిటిషన్ అంశంపై మాట్లాడారు. తన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చి యువతతో డ్యాన్స్ చేశానని తెలిపారు.
Danam Nagender
Khairatabad MLA
Disqualification Petition
Telangana Speaker
Peoples Plaza

More Telugu News