Revanth Reddy: శుభపరిణామం: రేవంత్ రెడ్డి నిర్ణయంపై హరీశ్ రావు ప్రశంసలు

Harish Rao Praises Revanth Reddys Decision on Sharada Peetham Land
  • శారదాపీఠంకు కేటాయించిన భూములు పీఠానికే చెందేలా సీఎం ఆదేశాలు
  • ముఖ్యమంత్రి ఆదేశాలు శుభపరిణామమన్న ముఖ్యమంత్రి
  • రేవంత్ రెడ్డికి అమ్మారు ఇప్పటికైనా సరైన బుద్ధి ప్రసాదించారన్న హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయంపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కోకాపేటలోని శారదాపీఠంకు కేటాయించిన భూములను తిరిగి పీఠానికే కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడంపై హరీశ్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు శుభపరిణామమని అన్నారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

కోకాపేటలో శారదా పీఠం భూములను జలమండలికి కేటాయించిన నిర్ణయాన్ని రద్దు చేయడం రాజ శ్యామలాదేవి అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయమని, ఇది  భక్తుల విజయమని పేర్కొన్నారు. ఆ అమ్మవారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి ప్రసాదించారని అన్నారు.

అదే సమయంలో, ఎలాంటి స్పష్టమైన ప్రజాప్రయోజన ప్రతిపాదిక లేకుండా పర్యావరణ  నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ  ఖజానాకు తూట్లు పొడుస్తూ నామినేషన్ పద్ధతిలో మీ అల్లుడి అనుయాయులకి  హెచ్ఎండీఏ ద్వారా కేటాయించిన 17 ఎకరాల భూమి సంగతి ఏమిటని హరీశ్ రావు ముఖ్యమంత్రిని నిలదీశారు. ఆ భూమిలో కొనసాగుతున్న క్రషర్ యూనిట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.
Revanth Reddy
Harish Rao
Telangana
BRS
Sharada Peetham
Kokapet
Land Allocation

More Telugu News