Vijay Deverakonda: విజయ్-రష్మిక పెళ్లి: అతిథులకు జపనీస్ విందు.. నో ఫోన్ పాలసీ!

Vijay Rashmika Wedding Japanese Feast and No Phone Policy
  • 26న ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం
  • పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్న జంట
  • అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా జరగనున్న వేడుక
  • మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్
టాలీవుడ్ క్యూట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహానికి ముహూర్తం ఖరారైంది. ఎప్పటినుంచో వీరి పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఏడడుగులు వేయనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

సోమవారమే విజయ్, రష్మిక తమ కుటుంబసభ్యులతో కలిసి ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. అక్కడి 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్' ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వేదిక కానుంది. మంగళవారం నుంచి హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో పెళ్లి సందడి మొదలుకానుంది. ఈ వేడుకలను అత్యంత ప్రైవేట్‌గా, కేవలం 50 నుంచి 100 మంది సన్నిహితుల మధ్యే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులకు 'నో-ఫోన్' పాలసీని కఠినంగా అమలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు, పెళ్లి విందులో అతిథుల కోసం ప్రత్యేకంగా జపనీస్ వంటకాలను ఏర్పాటు చేసినట్టు రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ఆన్‌స్క్రీన్ హిట్‌ పెయిర్‌గా నిలిచిన వీరిద్దరూ, ఇప్పుడు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో పలు రంగాల ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
Vijay Deverakonda
Rashmika Mandanna
Vijay Rashmika wedding
Tollywood wedding
Udaipur wedding
Telugu cinema
Geetha Govindam
Dear Comrade
Indian celebrity wedding
Japanese cuisine

More Telugu News