2 నెలల చిన్నారి మృతిపై డీజీపీకి బీఆర్ఎస్ వినతి పత్రం
- కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట... చిన్నారి మృతి
- డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్
- బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి
ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కూతురును పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో చిన్నారి కిందపడి మృతి చెందింది. నిర్వాహుకుల కారణంగానే తమ కూతురు కిందపడిందని గణేశ్ దంపతులు ఆరోపిస్తున్నారు.