Tarakaratna: తారకరత్న బతికుంటే ఇవాళ 43వ పుట్టినరోజు జరుపుకునేవాడు: విజయసాయిరెడ్డి

Tarakaratna Would Have Celebrated 43rd Birthday Today Says Vijayasai Reddy
  • దివంగత నటుడు నందమూరి తారకరత్న 43వ జయంతి నేడు
  • ఈ సందర్భంగా ఆయన్ను స్మరించుకున్న విజయసాయిరెడ్డి
  • భౌతికంగా లేకపోయినా జ్ఞాపకాలు మాతోనే ఉంటాయంటూ భావోద్వేగ పోస్ట్
దివంగత నటుడు నందమూరి తారకరత్న 43వ జయంతి సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి అతడిని స్మరించుకుంటూ భావోద్వేగ నివాళి అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉన్న వారి బంధుత్వాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఈ ట్రిబ్యూట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

"ఈ రోజు మన మధ్య ఉండుంటే తారకరత్న 43వ పుట్టినరోజు జరుపుకునేవాడు. విధి అతడిని త్వరగా దూరం చేసినా, అతడి జ్ఞాపకాలు, చిరునవ్వు, ఆత్మీయత మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. మా కళ్ల ముందు లేకపోయినా, మా ఆలోచనల నుంచి ఎప్పటికీ దూరం కాడు. అతడి జయంతి సందర్భంగా తీవ్ర భావోద్వేగంతో, గౌరవంతో స్మరించుకుంటున్నాను" అని విజయసాయిరెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డికి, నందమూరి తారకరత్న కుటుంబానికి మధ్య బంధుత్వం ఉన్న విషయం తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు.

2023లో తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ కన్నుమూయడం తెలిసిందే.
Tarakaratna
Nandamuri Tarakaratna
Vijayasai Reddy
Alekhya Reddy
Tarakaratna birthday
Telugu actor
Heart attack
Tarakaratna death
Tollywood actor
Telugu cinema

More Telugu News