Rashmika Mandanna: రష్మికతో వివాహం కానందుకు రక్షిత్ బాధపడటం లేదు: నటుడు ప్రమోద్

Rakshit Shetty Not Bothered About Not Marrying Rashmika Says Pramod
  • గతంలో రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం
  • వివాహం జరగకుండానే విడిపోయిన రక్షిత్, రష్మిక
  • రష్మిక-విజయ్ వివాహంపై స్పందించిన రక్షిత్ సన్నిహితుడు ప్రమోద్
  • మమ్మల్ని వివాహానికి పిలవదని తెలుసని వ్యాఖ్య
రష్మిక తమను పెళ్లికి పిలవదని తమకు తెలుసని ప్రముఖ నటుడు ప్రమోద్ శెట్టి అన్నారు. రష్మికకు నటుడు రక్షిత్ శెట్టితో గతంలో నిశ్చితార్థం జరిగింది. అయితే వివాహం జరగకుండానే వీరిద్దరు విడిపోయారు. ఈ నేపథ్యంలో రక్షిత్ శెట్టి సన్నిహితుడు ప్రమోద్ రష్మిక, విజయ్ దేవరకొండ వివాహంపై స్పందించారు. తనకు ఆహ్వానం అందలేదని, అందితే వెళతానని చెప్పారు.

అయితే వారి వివాహానికి తనను, రక్షిత్ శెట్టిని ఆహ్వానిస్తారని వేచి చూడటం లేదని తెలిపారు. రష్మికకు ఆహ్వానించే ఉద్దేశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రక్షిత్ శెట్టి ప్రస్తుతం సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని వెల్లడించాడు. రష్మికతో వివాహం జరగనందుకు రక్షిత్ బాధపడటం లేదని పేర్కొన్నారు. చాక్లెట్ తింటూ అదే విషయం గురించి ఆలోచించడానికి అతనేం పిల్లవాడు కాదన్నారు. ఈ విషయం ఆయన సన్నిహితులందరికీ తెలుసని చెప్పారు.

ఈ నెల 26న విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా జరగనున్నట్టు తెలుస్తోంది.
Rashmika Mandanna
Rakshit Shetty
Vijay Deverakonda
Pramod Shetty
Rashmika Vijay wedding

More Telugu News