సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్ వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు
- అల్లు అర్జున్ సహా 23 మందిపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు
- సాంకేతిక లోపాలను గుర్తించిన నాంపల్లి కోర్టు
- హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, సీడీలను జత చేయకపోవడంతో వెనక్కి పంపిన కోర్టు
ఎవిడెన్స్ మెటీరియల్ సమగ్రంగా లేదని, సాక్ష్యాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, సీడీలను జతచేయకపోవడంతో కోర్టు ఛార్జ్‌షీట్‌ను వెనక్కి పంపించింది. ఎలాంటి లోపాలు లేకుండా ఫార్మాట్ ప్రకారం, ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అన్నింటికి ఆధారాలతో మరోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. గతంలో రెండుసార్లు కూడా ఛార్జ్‌షీట్‌లో సాంకేతిక కారణాలు చూపిస్తూ కోర్టు వెనక్కి పంపించింది.