Vijay Sethupathi: విజయ్ సేతుపతి కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Vijay Sethupathis New Movie Titled Pocket Novel
షార్ట్స్‌లో చూడండి
తమిళంలో విలక్షణ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘పాకెట్ నావెల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.

చిత్ర నిర్మాణ సంస్థ టైలర్ డర్డెన్ అండ్ కింగ్ ఫిస్ట్ (TDKF) సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘త్యాగరాజన్ కుమారరాజాస్ #POCKETNOVEL. షూట్ బిగిన్స్!’ అని పోస్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో విజయ్ సేతుపతి సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ నటుడు రాజ్ బి శెట్టి మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

చెన్నైలోని వడపళనిలో ఒక సింపుల్ పూజా కార్యక్రమంతో షూటింగ్ మొదలైనట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తుండటం ప్రధాన ఆకర్షణ కాగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‘కొలైగారన్’, ‘వదంది’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆండ్రూ లూయిస్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. విలక్షణ నటుడు కిశర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సత్యరాజ్ నటరాజన్ ఎడిటర్‌గా, యుగభారతి గీత రచయితగా పనిచేస్తున్నారు.
Go Back to Shorts
Vijay Sethupathi
Pocket Novel
Thiagarajan Kumararaja
Malavika Mohanan
Raj B Shetty
Tamil Cinema
Kolaiyaran
Vadhandhi
Ilaiyaraaja
Tamil Movie

More Telugu News