రేవంత్ రెడ్డిని కలిసి తన పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Invites Revanth Reddy to Wedding
  • ఈ నెల 26న విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం
  • ఉదయ్ పూర్ లోని ప్యాలస్ లో పెళ్లి వేడుక
  • రేవంత్ రెడ్డికి పెళ్లి పత్రిక అందించిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగబోతోంది. ఉదయ్ పూర్ లోని ప్యాలస్ లో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు... చివరకు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఉదయ్ పూర్ లో వివాహానంతరం ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో... విజయ్ దేవరకొండ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజయ్ కలిశాడు. హైదరాబాద్ లోని రేవంత్ నివాసానికి వెళ్లి స్వయంగా పెళ్లి పత్రికను అందించాడు. తన పెళ్లికి రావాలని ఆహ్వానించాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ముఖ్యమంత్రి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
Vijay Deverakonda
Revanth Reddy
Rashmika Mandanna
Vijay Deverakonda wedding
Telugu Cinema
Tollywood
Udaipur
Telangana CM
Celebrity Wedding
Hyderabad Reception

More Telugu News