Sreeleela: నన్ను నేను 'డాక్టర్ శ్రీలీల'గా పరిచయం చేసుకుంటున్నాను: శ్రీలీల

Sreeleela Introduces Herself as Doctor Sreeleela
  • డాక్టర్‌గా మారిన ప్రముఖ నటి శ్రీలీల
  • సోషల్ మీడియా ద్వారా శుభవార్త పంచుకున్న వైనం
  • షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే చదువు పూర్తి
  • ఇకపై డాక్టర్ శ్రీలీల అని పిలవాలంటూ పోస్ట్
  • కుటుంబం, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపిన హీరోయిన్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తన జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. నటనలో అగ్రస్థానంలో కొనసాగుతూనే, ఆమె ఇప్పుడు డాక్టర్‌గా మారారు. కొన్ని రోజుల కిందట ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. దీనిపై ఇవాళ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇకపై తనను 'డాక్టర్ శ్రీలీల'గా ప్రేమగా పరిచయం చేసుకుంటున్నట్లు తెలిపారు.

"మీ అమ్మాయి తన మాట నిలబెట్టుకుంది" అంటూ తన పోస్ట్‌ను ప్రారంభించిన శ్రీలీల, ఈ ప్రయాణం తనకెంతో ప్రత్యేకమని అన్నారు. ఇది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదని, తన ఎదుగుదల, విశ్వాసం, కన్నీళ్లు, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. తాను చదువుకునే ప్రదేశం తనకు ఒక పవిత్రమైన స్థలంలాంటిదని, అక్కడ మాత్రమే తాను తనలా ఉండగలిగానని వివరించారు.

ఈ కష్ట సమయంలో తన పరీక్షలకు సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, చిత్ర బృందాలకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనను తాను నమ్మడం నేర్చుకుంటున్న దశలో తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూ కూడా పట్టుదలతో చదువును పూర్తి చేసి డాక్టర్ పట్టా సాధించడంపై శ్రీలీలను అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sreeleela
Sreeleela MBBS
Sreeleela Doctor
Telugu Actress
Tollywood Actress
Sreeleela Graduation
Sreeleela Movies
Indian Actress
MBBS Degree

More Telugu News