Madhapur SI: మాదాపూర్ ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

Madhapur SI Vinay Caught Red Handed by ACB
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లో మరో అవినీతి పోలీసు అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్సై వినయ్ ఈరోజు రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. 

వివరాల్లోకి వెళితే, ఓ కేసు విషయంలో సహకారం అందిస్తానంటూ ఫిర్యాదుదారుడి నుంచి వినయ్ రూ. 50 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం డబ్బులు తీసుకుంటున్న తరుణంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగదును సీజ్ చేశారు. ఎస్సై వినయ్ ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Madhapur SI
ACB
Hyderabad Police
Bribery Case
Telangana ACB
Corruption
Police Officer Arrested
SI Vinay
Red Handed

More Telugu News