Vahini: క్యాన్సర్ తో పోరాడుతూ నటి వాహిని మృతి

Actress Vahini Dies of Cancer in Vijayanagaram
  • స్వస్థలం విజయనగరంలో కన్నుమూసిన వాహిని
  • ఆమె వయసు 48 ఏళ్లు 
  • సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటించిన వాహిని
సినీ నటి వాహిని కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆమె... తన స్వస్థలం విజయనగరంలో నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ నటి కరాటే కల్యాణి వెల్లడించారు. వాహిని మృతి పట్ల సహ నటీనటులు, సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

48 ఏళ్ల వాహిని విజయనగరంలో జన్మించారు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. సహాయ నటిగా మంచి గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఆమె సందడి చేశారు. అనేక ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో ఆమె నటించారు. సీరియల్స్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు.

More Telugu News

Vahini
Vahini actress
Telugu actress Vahini
Tollywood actress
Cancer death
Telugu cinema
Tamil cinema
Karate Kalyani