Narendra Modi: సహనమే భారత్ ను గెలిపించిందన్న మోదీ

Narendra Modi says patience won India trade deal
  • అమెరికాతో ట్రేడ్ డీల్ పై స్పందించిన ప్రధాని
  • ఎన్ని విమర్శలు వచ్చినా సహనంతో ఉన్నామని వెల్లడి
  • వాణిజ్య చర్చలపై ప్రభుత్వ స్థిరమైన వైఖరికి ఇదే నిదర్శనమని వ్యాఖ్య
విదేశాలతో వాణిజ్య చర్చలకు సంబంధించి ప్రభుత్వం స్థిరమైన వైఖరితో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికాతో చారిత్రాత్మక ట్రేడ్ డీల్ కుదిరిన సందర్భంగా ఎన్డీయే కూటమి సమావేశంలో మోదీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లు విధించడంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. సుంకాల విషయంలో తమ ప్రభుత్వాన్ని విమర్శలు చుట్టుముట్టాయని గుర్తుచేసుకున్నారు.

అయితే, ప్రభుత్వం మాత్రం సహనంతో వేచి ఉందని, దాని ఫలితం ఈ రోజు అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా కుదిరిన ట్రేడ్ డీల్ తో అనుకూల ఆర్థిక వాతావరణం నెలకొందన్నారు. ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎన్నో దేశాలు వాణిజ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత్‌ మాత్రం ప్రయోజనం పొందుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

More Telugu News

Narendra Modi
India trade deal
US trade deal
Trade agreement
Economic policy
Tariffs
Donald Trump
NDA meeting
International trade
India economy