Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్ష

Sheikh Hasina sentenced to jail in Bangladesh corruption case
  • రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో శిక్ష ఖరారు
  • షేక్ హసీనాతో పాటు బంధువులకు కూడా జైలు శిక్ష
  • తీర్పు వెలువరించిన ఢాకాలోని కోర్టు-4కు చెందిన ప్రత్యేక జడ్జి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు జైలు శిక్ష విధించింది. రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టుకు సంబంధం ఉన్న ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి షేక్ హసీనాతో పాటు ఆమె బంధువులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఢాకాలోని కోర్టు-4కు చెందిన ప్రత్యేక జడ్జి రాబిల్ ఆలమ్ ఈ కేసులో తీర్పును వెలువరించారు. షేక్ హసీనాకు ఒక్కో కేసులో ఐదేళ్ల చొప్పున మొత్తం పదేళ్ల జైలు శిక్ష విధించారు. 

షేక్ హసీనా మేనల్లుడు రద్వాన్ ముజిబ్ సిద్ధిక్, మేనకోడళ్లు తులిప్ రిజ్వానా సిద్ధిక్, అజ్మినా సిద్ధిక్‌లకు కూడా ఈ అవినీతి కేసుల్లో శిక్ష పడింది. ముజిబ్ సిద్ధిక్‌కు నాలుగేళ్లు, మేనకోడళ్లకు ఏడేళ్ల చొప్పున శిక్ష విధించారు. రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టు కేసులో సరెండర్ అయిన ఖుర్షీద్ ఆలమ్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. నిందితులందరికీ జరిమానా కూడా విధించారు. జరిమానా కట్టని పక్షంలో అదనంగా ఆరు నెలలు జైలు జీవితాన్ని అనుభవించాలని ఆదేశించారు.
Sheikh Hasina
Bangladesh
Bangladesh ex-PM
Corruption case
Dhaka court
Rajuk New Town project

More Telugu News